Lokesh: దావోస్ పర్యటన… మాజీమంత్రి రోజాకు కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్?

Lokesh: ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బృందం ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొని పలువురు కంపెనీల ప్రతినిధులతో పాటు సీఈఓ లతో కూడా భేటీ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదని అందుకే ఒక్క ఎంఓయు కూడా చేసుకోలేకపోయారు అంటూ విమర్శలు వచ్చాయి.

ఇలా దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు. ఈ పర్యటనలో భాగంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఉత్త చేతులతో వెనక్కి వచ్చారని విమర్శించారు. వీరు వెళ్లటనికి ఫ్లైట్లో ఇతర ఖర్చులు దండగ అంటూ ఆమె విమర్శించారు అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ రోజాకు కౌంటర్ ఇచ్చారు.

నేడు నారా లోకేష్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వేసిన పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టులో ఇవాళ లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు ఇలా కోర్టుకు హాజరైన ఈయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా దావోస్ పర్యటన గురించి మాట్లాడారు. గత ప్రభుత్వం దావోస్ పర్యటనకు వెళ్లి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేకపోయింది అని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని తెలిపారు.

ఇక ఈ పర్యటనలో భాగంగా పక్క రాష్ట్రాలకు లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి కారణం అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఒకే పార్టీ అధికారంలోకి ఉండటమే కారణమని తెలిపారు.చంద్రబాబు నాయుడు 1997 నుంచి దావోస్ వెళ్తున్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగితే ఎందుకు పరిశ్రమలు స్థాపించలేక పోయారని లోకేశ్ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే మీడియా వారు రోజా చేసిన కామెంట్ల గురించి కూడా నారా లోకేష్ ని ప్రశ్నించారు. రోజాకు దావోస్ కు జ్యూరీచ్ కు తేడా తెలిదు అంటూ లోకేశ్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. రెడ్ బుక్ కోసం ఎందుకు వైసీపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. విశాఖలో 90 రోజుల్లో టీసీఎస్ ను ఏర్పాటు చేస్తామని లోకేశ్ చెప్పారు.