టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో సారి తాను చిన్న మనిషిని కాదని పెద్దవాణ్ని అయ్యానని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.. చిన్న పిల్లలు ఏ బీ సీ డీ లు చెప్పినట్లుగా రాజకీయ పాఠాలు అప్పచెప్పే ఈ చిన్న బాబు ఈ మధ్య కాలంలో ఎన్నో కలలు కంటున్నాడటా.. తన బుల్లి బుల్లి వాయిస్‌తో ప్రత్యర్ధులను దడ దడలాడిస్తున్నట్లుగా, అధికారపక్షాన్ని అదిలిస్తున్నట్లుగా వస్తున్న కలలను నిజ జీవితంలో నిజం చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా నోరు తెరచి చాక్లెట్ చప్పరించినట్లుగా అధికార పార్టీ తీరును ప్రశ్నిస్తున్నాడట..
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు నారా లోకేష్ పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన నేపద్యం లో అధికార పార్టీ తీరు పై ఘాటు విమర్శలు చేశారు.. తమ పరిపాలనలో కష్టం అంటే తెలియని ప్రజలకు వైసీపీ ప్రభుత్వం కష్టాల రుచి చూపిస్తుందన్న లెవల్లో ఫీలైపోతు, ప్రజలంటే తమ ఆత్మ బంధువులు అనే భావనతో ఉన్నట్టుగా కలరింగ్ ఇస్తూ వరదలతో కష్ట నష్టాల పాలు అయిన ప్రజలను ఆదుకొనే తీరిక లేకుండా పోయిందా ఈ ప్రభుత్వానికి అంటూ ఎగిరిపడ్డాడట.. వైసీపీ ప్రభుత్వం ప్రజా పాలనను అటకెక్కించింది కాబట్టి తాను ఏపీ ప్రజల తరపున యుద్ధం చేయడానికి వచ్చా అన్నట్లుగా మనసులో అనుకుంటు కనీసం తన పర్యటన తో అయినా ప్రజల బాధలు, పాలకుల దృష్టికి తీసుకు వెళ్లుచున్నా అనే సంతృప్తిపడుతూ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించడానికి వచ్చానని చెప్పుకొచ్చారు నారా లోకేష్.
ఇక సినిమాలో కష్టాలను ఏకరువు పెట్టినట్టుగా జగ్గంపేట నియోజక వర్గం రామవరం గ్రామంలో వరద ఉదృతి కి కుప్ప కూలిన ఇళ్లు, నీట మునిగిన పంట పొలాలను చూస్తుంటే మనసు చలించిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేయడం నిజంగా అద్భుత నటన అనిపించిందట చూసే వారికి.. ఇక పసి మనస్సు కలిగిన లోకేశం ఎప్పుడు వచ్చి రైతులను, గ్రామస్తులను పరామర్శించి ధైర్యం చెబుతాడా అని ఎదురు చూస్తున్న ఆ గ్రామస్తులకు లోకేష్ రాకతో ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్లుగా తనకు తానే ఊహించుకుంటూ అక్కడి ప్రజలను విడువలేక విడిచిపోతు తన పర్యటన ముగించుకున్నాడటా.. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ట్విట్టర్ పిట్ట అయిన నారా లోకేష్..