ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా తిరుపతి ఉపఎన్నిక ఫీవర్ పట్టుకుంది. అందుకే.. అధికార పార్టీతో సహా.. టీడీపీ, బీజేపీ, జనసేన అన్నీ అప్రమత్తమయ్యాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒక్క తిరుపతి ఉపఎన్నికే కాదు.. భవిష్యత్తులో ఏపీలో ఏ ఎన్నిక వచ్చినా సరే.. గెలుపు తమ పార్టీదే ఉండాలన్న కసితో ఉన్నాయి.
ఇక.. టీడీపీ గురించి మాట్లాడుకుంటే… చంద్రబాబు ఎలాగూ ఎప్పుడూ యాక్టివే. ఇటీవలే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు కూడా అధికార వైసీపీ పార్టీపై విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ మీద విమర్శల యుద్ధం చేస్తూ… టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం ప్రస్తుతానికి పెద్దగా బయటికి రావడం లేదు కానీ.. ఇంట్లో ఉండే చాలా ప్లాన్లు వేస్తున్నారట ఆయన. సోషల్ మీడియాలో ప్రతిరోజు ప్రభుత్వంపై ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు లోకేశ్. అయితే.. సోషల్ మీడియాలోనే ఉంటే కష్టం కదా. అప్పుడప్పుడు బయటికి కూడా రావాలి. ఓవైపు చంద్రబాబు తర్వాత అచ్చెన్నాయుడు పార్టీలో దూసుకుపోతున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీకి దిక్కు ఎవరంటే నో డౌట్ అచ్చెన్న అనే చెప్పుకోవాలి.
అందుకే… చంద్రబాబు తర్వాతి స్థానాన్ని పొందాలంటే లోకేశ్ ఇకనైనా బరిలోకి దిగాల్సిందే అని అనుకున్నారట. అందుకే… రైతులకు దగ్గరవ్వాలని.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని లోకేశ్ బాబు వ్యూహాలు రచిస్తున్నారట.
అప్పట్లో వైఎస్సార్ కూడా ఇలాగే పాదయాత్ర చేసి.. రైతుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. సేమ్ అలాగే.. లోకేశ్ కూడా ఏపీ మొత్తం తిరిగి.. రైతులను పరామర్శించే యాత్రను చేపట్టాలని అనుకుంటున్నారట.
మరి.. ఆ పర్యటన తిరుపతి ఉపఎన్నిక తర్వాత ఉంటుందా? లేక తిరుపతి ఉపఎన్నికకు ముందు ఉంటుందా? అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద లోకేశ్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో త్వరలో చూడబోతున్నాం మనం.