సమస్యే లేదు.. అందుకు నాని ఒప్పుకోవట్లేదు

Nani not interested in OTT release

Nani not interested in OTT release

లాక్ డౌన్ తరుణంలో మొదటగా ఓటీటీలకు ఓటు వేసిన హీరోల్లో నాని కూడ ఒకరు. ఆయన చేసిన ‘వి’ చిత్రం ప్రైమ్ ద్వారా విడుదలైంది. అలాంటి నాని ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అంటే ఇంతెత్తున లేస్తున్నారట. నాని కొత్త చిత్రం ‘టక్ జగదీష్’. శివ న్రివన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సినిమా మీద నాని చాలా ఆశలే పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో కూడ మంచి ఆసక్తి ఉంది సినిమా మీద. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదాపడింది. 50 శాతం ఆక్యుపెన్సీ, తగ్గినా టికెట్ ధరలు, నైట్ కర్ఫ్యూల వలన రిలీజ్ చేసే పరిస్థితులు లేవు.

అందుకే వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో క్లారిటీ లేదు. దీంతో నిర్మాతల మనసులో ఓటీటీ విడుదలకు వెళ్లాలనే ఆలోచన కలిగిందట. ఇది నానికి అస్సలు ఇష్టం లేదట. అసలు ఓటీటీ ప్రసక్తే వద్దని అంటున్నారట. థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు ఎదురుచూడాల్సిందేనని, తొందరపడి ఓటీటీలకు వెళ్తే సినిమాకు నష్టం జరుగుతుందని వారిస్తున్నారట. మరి ఓటీటీల మీద నాని ఇంతలా విముఖత చూపడానికి రీజన్ ‘వి’ సినిమా ఫలితమైనా అయ్యుండాలి లేదా ‘టక్ జగదీష్’ మీద థియేటర్లలో అయితే తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకమైనా అయ్యుండాలి.