AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా సంచలనంగాను, వివాదాస్పదంగాను ఉంటాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విజయ్ సాయి రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. విజయ్ సాయి రెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయారని చంద్రబాబుకు మంచి జరగడం కోసమే వైసీపీ పార్టీ నుంచి తప్పుకున్నారు అంటూ విజయ సాయి రెడ్డి పై ఆరోపణలు చేశారు.
వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు రావడం ఆయన గురించి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు సంచలనంగా మారాయి. తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి గురించి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలపై తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పరోక్షంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి తన పెదనాన్న విజయసాయిరెడ్డితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు. కానీ నిజం లోపల నిశ్శబ్దంగా, బలంగా ఉంటుంది. కొన్ని తప్పుడు కథనాలు ఉన్నప్పటికీ, అది అర్హులు కాని వారి పట్ల గౌరవం. నమ్మకం, విధేయత, నీతి అనేవి బోధించినవి మాత్రమే కాదని ఇప్పటికీ జీవించబడ్డాయి. చాలా మంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, వాటిని తాను చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నాను. మీరు కూడా మాట్లాడాలని ఎంచుకుంటే ఏమి జరుగుతుంది? మేం కూడా మాట్లాడటం మొదలు పెడితే ఏం జరుగుతుందని.. ఇది నిజం అంటూ పోస్ట్ చేశారు.
ఇలా జగన్మోహన్ రెడ్డి తన పెదనాన్న విజయ్ సాయి రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేశారని స్పష్టం అవుతుంది. మరి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విజయ్ సాయి రెడ్డి స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.