Ntr: పేరు పెట్టుకుంటే రాలేదు…పుట్టుకతోనే వచ్చింది… ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన నందమూరి ఫ్యామిలీ!

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. అయితే ఎన్టీఆర్ మొదటి పేరు ఇది కాదనే విషయం మనకు తెలిసిందే. ఈయనకు ఈ పేరును స్వయంగా నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ను పిలిపించి ఆయనకు తన పేరును పెట్టారంటూ హరికృష్ణ ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇలా ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న ఈయన ఇండస్ట్రీలో తన తాతయ్య పేరును నిలబెడుతూ తాతకు తగ్గ మనవడు అనే విధంగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం నందమూరి ఫ్యామిలీ మొదటినుంచి కూడా దూరం పెడుతూ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.

హరికృష్ణ మొదటి కుమారుడు దివంగత జానకిరామ్ కుమారుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవిఆర్ చౌదరి ఇటీవల సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తారక రామారావు అమెరికాలో పుట్టారు ఆయన పుట్టుకతోనే తమ తండ్రి పేరును అందిపుచ్చుకున్నారని తెలిపారు.పుట్టుకతో అతనికి తారక రామారావు పేరు వచ్చింది సగంలో ఎవరూ కూడా ఇలా ఆయనకు పేరు పెట్టింది కాదు అంటూ మోహన్ కృష్ణ ఈ విషయాన్ని నొక్కి చెప్పడంతో కచ్చితంగా ఎన్టీఆర్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతుంది. ఇలా ఎన్టీఆర్ గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.