Tarakarathna: నందమూరి హీరో తారకరత్న 2023 లో ఫిబ్రవరి 18వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. యువగలం పాదయాత్ర సమయంలో తారకరత్న కు ఊహించిన విధంగా హార్ట్ ఎటాక్ రావడం ఆ తర్వాత 22 రోజులపాటు ప్రాణాలతో హాస్పిటల్లో కొట్టుమిట్టాడటం, ప్రాణాలతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే తారకరత్న ఈ లోకాన్ని విడిచి నేటికీ దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అయింది. అయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ జ్ఞాపకాలు మాత్రం కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అయితే నేడు భర్త వర్ధంతి సందర్భంగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆ పోస్టులో ఈ విధంగా రాసకొచ్చింది అలేఖ్య. నువ్వు వెళ్లిపోతూ మిగిల్చిన ఈ శూన్యాన్ని ఈ ప్రపంచంలో ఇంకేది భర్తీ చేయలేదు.. నిన్ను ఈ విధి మా నుంచి దూరం చేసింది.. ఈ గాయాన్ని ఈ కాలం కూడా మాన్పించలేదు.. బద్దలైన గుండె మళ్లీ అతకలేదు.. మనం ఇలా విడిపోకుండా ఉండాల్సింది.
నువ్వు మాతో ఉండకపోవచ్చు కానీ, నీ ప్రభావం మా జీవితాల మీద ఉంటుంది. మా కలలో నువ్వు ఎప్పటికీ బతికే ఉంటావు. నువ్వు లేని ఈ బాధను నేను మాటల్లో చెప్పలేను.. మిస్ యూ అంటూ అలేఖ్య తారకరత్న గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూనే తారకరత్న వర్ధంతి పట్ల బాధను వ్యక్తం చేస్తున్నారు. భర్త దూరమైన బాధను దిగమింగుకొని పిల్లలతో ఎప్పుడూ సంతోషంగా ఉంటూ పిల్లలకు సంబంధించిన విషయాలు తనకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అలేఖ్య.