Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలేఖ్య సిస్టర్స్ ముగ్గురు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అనంతరం పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ బిజినెస్ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఒక కస్టమర్ పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో ఆ కస్టమర్ పై బూతులతో విరుచుకుపడ్డారు.
ఇలా ఈ వివాదం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అదే విధంగా అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ కూడా క్లోజ్ అయిందని చెప్పాలి. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైనటువంటి రమ్య మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం రీల్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.
ఇక రమ్య వీడియోలు పై భారీ స్థాయిలో విమర్శలు కూడా వచ్చేవి. తాజాగా రమ్య సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఒక సినిమా వేడుకలో భాగంగా ఈమె కనిపించి సందడి చేశారు. దీంతో ఈ వీడియోలు ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈమె ఏ సినిమాలో నటిస్తుంది హీరో ఎవరు అనే విషయానికి వస్తే…
అశ్విన్‌బాబు హీరోగా.. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమాలో చిన్న పాత్రలో రమ్య నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రమ్య కనిపించి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పై పెద్ద ఎత్తున మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత పాపులర్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో వివాదాలను ట్రోలర్స్ ఎదుర్కొని రమ్య పాప సినిమా ఛాన్సులు కొట్టేసిందని చెప్పాలి.