Crime: కొలిక్కి వచ్చిన నల్గొండ హత్య కేసు.. లభించిన మొండెం.. ఎక్కడ దొరికిందంటే?

Crime: సోమవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్‌నగర్‌ మహంకాళీ అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర తలను ఉంచి మొండెం మాయం చేసిన ఘటన అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అయితే ఈ కేసును పరిష్కరించిన పోలీసులు ఇది ఎవరైనా హత్య చేశారా లేక నరబలి ఇచ్చారా అన్న కోణంలో ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం కావడంతో పాటు మొండాన్ని కూడా పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ దగ్గర శిరస్సు లేని మొండం లభ్యం అయ్యింది.ఇళ్ల మధ్యలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకు బిల్డిండ్‌ మీద తల లేని మొండెంను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఈ క్రమంలోనే హత్యకు గురైన వ్యక్తి వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌ తండాకు చెందిన రమావత్‌ జయేందర్‌ నాయక్‌ అని పోలీసులు అతని కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా మొండెం లభ్యం కావడంతో పోలీసులు ఈ శిరస్సు లేని మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉండగా పోలీసులు ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలా ఒక్కసారిగా మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర మొండెం లేని శిరస్సు కనిపించడం అందరిని ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసినప్పటికీ చివరికి పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారు. అయితే ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.