Nagavamshi: 30 కోట్లతో 300 కొల్లగొట్టిన దుల్కర్… తెలుగోళ్లకు ఈ సత్తా లేదా? 

Nagavamshi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నాగావంశీ ఒకరు. నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను విడుదల చేయడమే కాకుండా ఇతర భాష సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే ఇటీవల ఈయన కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక బాలీవుడ్ చిత్రం వార్ 2 తెలుగు సినిమా హక్కులను నాగ వంశీ కొనుగోలు చేశారు. ఈ సినిమా కూడా కాస్త నిరాశపరిచిందని చెప్పాలి.

ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో మలయాళంలో విడుదలైన కొత్త లోక్ చాప్టర్ 1 సినిమాని తెలుగులో విడుదల చేశారు అయితే ఎలాంటి ప్రమోషన్లు లేకుండా విడుదలైనప్పటికీ సినిమాకు మంచి హైప్రావడంతో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ నాగ వంశీకి మైక్ ఇవ్వడంతో వెంటనే నాగ వంశీ సుమతో మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ గారికి మలయాళంలో కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి. దుల్కర్ సల్మాన్ 30 కోట్లతో సినిమా చేసి 300 కోట్ల కలెక్షన్లను రాబట్టారు.

ఇలా ఇతర భాష సెలబ్రిటీలు ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగు వాళ్లకు ఇలాంటి సినిమాలు చేయడం చేతకాదా అంటూ మమ్మల్ని ఇంటర్నెట్లో తిడుతున్నారు. ఈ విషయాన్ని మలయాళంలో దుల్కర్ గారికి చెప్పండి అంటూ నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే ఇటీవల కాలంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో సినిమాలు చేసిన లేదా ఆయన సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్న ఇక్కడ కూడా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఈయన తెలుగులో చివరిగా లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.