Nagavamshi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఒకరు. ఈయన నిర్మాణ సారథ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. త్వరలోనే ఈయన నిర్మాణంలో తెరకెక్కిన కింగ్ డం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నాగ వంశీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.సోషల్‌మీడియాలో 10 రూపాయలకి, 50 రూపాయలకి అవీ ఇవీ వస్తున్నాయని సోషల్‌మీడియాలో పెట్టడం ఈజీ. ఒక మూడు గంటలు థియేటర్‌కి వెళ్లి నచ్చిన సినిమాని, నచ్చిన హీరోని చూస్తున్నప్పుడు కొన్ని డబ్బులు పెడితే తప్పేంటి అని నేను అడుగుతున్నా. నా మాటలు నచ్చినా నచ్చకపోయినా ఇప్పటికీ సినిమా అనేది చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.
ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు తొలి ఐదు నిమిషాలు ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత కచ్చితంగా సినిమాల గురించే డిస్కషన్ పెట్టి మమ్మల్ని తిడుతుంటారు. సరే తిట్టుకోండి అదేదో థియేటర్‌కి వెళ్లి టిక్కెట్ కొని సినిమా చూసి తిట్టొచ్చు కదా.. దానికి కూడా పైరసీలో చూసి తిట్టాలా అంటూ ఈయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇలా సినిమా చాలా చీప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక నాగ వంశీ కింగ్ డం విషయానికి వస్తే ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసింది. మరి ఈ సినిమాతో నాగ వంశీ, విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
