Nagavamshi: ఆ కారణంతోనే ఆ హీరోయిన్ ను తప్పించాము… ఇన్నాళ్లకు బయటపెట్టిన నిర్మాత!

Nagavamshi: తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో సూర్యదేవర నాగవంశీ ఒకరు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేతగా ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక త్వరలోనే నాగవంశీ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డం సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా జులై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత నాగవంశీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం గుంటూరు కారం ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఇకపోతే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పూజ హెగ్డేను అనుకున్న సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే ఈ సినిమా షూటింగ్లో బాగామవ్వడమే కాకుండా కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది మహేష్ బాబు తల్లితండ్రులు చనిపోయిన నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని ఈ సమయంలోనే పూజా హెగ్డే ఇతర సినిమాలకు కమిట్ అయ్యారని నాగవంశీ తెలిపారు. ఇక మా సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేసరికి ఆమె ఇతర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే తనని ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చిందని అంతకుమించి ఏ విధమైనటువంటి విభేదాలు లేవని నాగ వంశీ పూజ హెగ్డేని గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడం పై చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.