Nagarjuna: నాగార్జునకు జగన్ అంటే భయమా.. అందుకే అలా మాట్లాడుతున్నాడా?

Nagarjuna: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వాదోపవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ విషయం సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ విషయం పట్ల ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తమదైన శైలిలో స్పందించారు. ఈ విషయం పట్ల టాలీవుడ్ కు సంబంధించిన పలువురు నిర్మాతలు, అలాగే బయ్యర్లు అందరూ ఏపీలో టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి అని వాదనలు వినిపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే థియేటర్లను కొనసాగించడం మావల్ల కాదు.. దయచేసి టికెట్ రేట్లను పెంచండి.. లేదంటే చెప్పండి మా థియేటర్లను ఫంక్షన్ హాల్స్ గా మార్చేసుకుంటాం అని కొందరు థియేటర్ యాజమాన్యాలు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఈ విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. ప్రతి ఒక్కరికి అందుబాటులో సినిమా ఉండాలి.. అందువల్లే టికెట్ రేట్లను తక్కువ చేసినట్టుగా చెబుతున్నారు.. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు వెయ్యి రూపాయలు లేనిదే సినిమా చూడలేక పోతున్నాడు.. కాబట్టి అలాంటి వారికి ఉపశమనం కలిగించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం బల్లగుద్ది మరి చెబుతోంది. ఇదే విషయం పై టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు టికెట్ రేట్లు పెంచాలి. ఇదే విధంగా ఉంటే మా వల్ల కాదు అన్నట్టుగా తేల్చిపారేస్తున్నాయి. కానీ హీరో అక్కినేని నాగార్జున మరియు పలువురు ఏం పర్వాలేదు.. ఏపీలో అంతా బాగానే ఉంది అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సి కళ్యాణ్ లాంటివారు మాట్లాడిన కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు.. ఒక చిన్న నిర్మాత కనుక అతని గురించి జనాలు ఎక్కువగా ఆలోచించడం లేదు.

ఒక స్టార్ హీరో అయి ఉండి నాగార్జున ఏపీ లో ఉన్న టికెట్ రేట్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నా సినిమాలకు అక్కడ ఉన్న టికెట్ రేట్లు సరిపోతాయి అంటూ మాట్లాడటంతో ఆ మాటలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి.ఏపీ ప్రభుత్వానికి భయపడి నాగార్జున ఆ విధంగా మాట్లాడుతున్నాడా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన పలువురు నిర్మాతలు నాగార్జున పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. మీరు ఒక్కరు బతికేస్తే చాలా నాగార్జున.. ఇండస్ట్రీ లో ఎవరు ఏమైనా మీకు అవసరం లేదు.. టికెట్ రేట్లతో కనీసం మెయింటెనెన్స్ కూడా రావడం లేదు.. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రతి ఒక్క థియేటర్ పరిస్థితి ఇదే.. అయినా కూడా నీవు ఏ మాత్రం నాకు ఇబ్బంది లేదు అంటూ మాట్లాడేసావు అంటూ ఇండస్ట్రీకి చెందిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జునకు వైయస్ జగన్ అంటే భయమో లేదంటే భక్తో అర్థం కావడం లేదు. అందువల్లే ఈ విధంగా సినీ ఇండస్ట్రీ బలి చేసే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ అతని పై మండిపడ్డారు.