టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కుటుంబంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జున నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అనంతరం కొన్ని మనస్పర్థల కారణంగా సమంత నాగచైతన్య విడిపోయారు. అలాగే అఖిల్ తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకొని అనంతరం మనస్పర్థల కారణంగా వీరి నిశ్చితార్థం అంతటితోనే ఆగిపోయింది.
ఇప్పటివరకు ఒక కొడుకు పెళ్లి బాధ్యత తనపై ఉండేది. ఎప్పుడైతే నాగ చైతన్య విడాకులు తీసుకున్నారో అనంతరం నాగచైతన్య పెళ్లి బాధ్యత కూడా నాగార్జున పై పడింది.ఈ క్రమంలోనే నాగార్జున కొత్త కోడలిని వెతికే పనిలో పడ్డారు. అయితే ముందుగా అఖిల్ కు పెళ్లి చేసిన తర్వాత నాగ చైతన్యకి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది.అయితే నాగచైతన్యకు అధికారికంగా విడాకులు రాకపోవడంతో కొద్ది రోజుల పాటు ఆయన వివాహాన్ని వాయిదా వేసి ముందు అఖిల్ కి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
అయితే అఖిల్ కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కాకుండా ఇండస్ట్రీ కి సంబంధంలేని అమ్మాయిని వెతికి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. నాగచైతన్య విషయంలో జరిగినట్లు అఖిల్ విషయంలో జరగకూడదని నాగార్జున ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అమ్మాయిని కూడా ఫిక్స్ చేశారనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. అయితే నాగ చైతన్య విడాకులు అధికారకంగా వచ్చిన తరువాత అఖిల్ వివాహం గురించి అధికారకంగా చేపనున్నట్టు తెలుస్తోంది.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉండి.