Amala: అక్కినేని నాగార్జున అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం ఇటీవల తను ప్రేమించిన అమ్మాయి జైనాబ్ తో ఎంతో ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లోనే అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహపు వేడుకలు జరిగాయి. ఇకపోతే వీరి వివాహ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ రిసెప్షన్ వేడుకకు సినిమా రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
ఇక జైనాబ్ అఖిల్ ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసినదే దాదాపు మూడు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ నెలలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రకటించారు. ఇక ప్రస్తుతం అఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజాగా జైనాబ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే అమల తనకు కొన్ని కండిషన్లు పెట్టింది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఇది కాస్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. అమల పెట్టిన కండిషన్లు కచ్చితంగా జైనాబ్ పాటించాలని ఆమె చెప్పారట. బయటకు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఇంటి పరువు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని దుస్తులు వేసుకోవాలని చెప్పారట.అలాగే నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని అందట. ఆ తర్వాత కుకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, భర్తకు దూరంగా ట్రిప్ లకు వెళ్లోద్దని కండీషన్ పెట్టిందట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి కొత్త కోడలు వీటిని ఫాలో అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది కానీ సమంత విషయంలో కూడా గతంలో అమల ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల విభేదాలు కూడా వచ్చాయని వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.