Nagarjuna: బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగార్జున.. ఎందుకో తెలుసా?

Nagarjuna: నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన ఈ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే బంగార్రాజు మ్యూజిక్ నైట్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ బహిరంగంగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

అసలు నాగార్జున అభిమానులకు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు మించి ఈ సినిమా ఉంటుందని,ఈ చిత్రానికి ఎంతో అద్భుతమైన మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు నాగార్జున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

బంగార్రాజు సినిమా 14వ తేదీ విడుదల కావడంతో 11వ తేదీ ట్రైలర్ రిలీజ్ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అభిమానులు ఎవరిని ఆహ్వానించడం లేదని, అందుకు నాగార్జున తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కేవలం చిత్ర బృందం సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరుగనుందని తెలియజేశారు. అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాగార్జున ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరూ ఆయన మాటలకు ఫిదా అయ్యారు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.