నాగబాబు పంచాయితీ.. దేవుడితోనా.? ఇదెక్కడి చోద్యం.?

దేవుడు వున్నాడా.? లేడా.? నమ్మినోళ్ళకు వుంటాడు, నమ్మనోళ్ళకు వుండడు. ఎవరి నమ్మకాలు వారివి. భారతదేశంలో మెజార్టీ ప్రజానీకం దేవుడు వున్నాడనే నమ్ముతోంది. దేవుడు లేడని నమ్మేవారూ వున్నారు. వారి సంఖ్య చాలా తక్కువ. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు.. ఇలి వివిధ మాతలకు చెందిన ప్రజలు, వారి వారి దేవుళ్ళను పూజించడం.. ఆయా మత విశ్వాసాల్ని పాటించడమే కాదు.. చాలా సందర్భాల్లో ఇతర మతాల్ని కూడా విశ్వసిస్తుండడం మన భారతీయుల ప్రత్యేకత. అసలు దేవుడు లేడంటూ సెలబ్రిటీలు స్టేట్మెంట్లు ఇచ్చస్తూ.. ఏవేవో కామెంట్లు చేసేయడం వల్ల ఎవరికి ప్రయోజనం.? అందునా, మెగా బ్రద్ నాగబాబు లాంటి వ్యక్తికి పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం వుందా.? వున్నట్టే వుంది మరి.

లేకపోతే, ఆయనెందుకు శాడిస్ట్, ఇగోయిస్ట్, సైకోపాతిక్ స్టుపిడ్.. ఇలాంటి మాటల్ని దేవుడ్ని ఉద్దేశించి ప్రయోగిస్తారు.? సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై నాగబాబులో ఇలా దేవుడి మీద విరక్తి కలిగి వుండొచ్చుగాక. అలాగని ఆయన ఇంతలా విరుచుకుపడిపోతే ఎలా.? దీన్ని కొందరు ఫన్ నోట్‌లో తీసుకుంటున్నారు. ఇంకొందరు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎలాగైతేనేం, పబ్లిసిటీ వచ్చింది కదా.. అని నాగబాబు సరిపెట్టుకుంటే అంతకన్నా బాధ్యతారాహిత్యం ఇంకోటుండదు. దేవుడి ఉనికిని ప్రశ్నించే నైతిక హక్కు ఈ రోజుల్లో ఎవరికైనా వుందా.? నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసి.. కమర్షియల్ ప్రపంచంలో బతికేస్తున్నాం మనం. ఆ విషయం నాగబాబుకి తెలియదా ఏంటి.?