Pithapuram: పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక కచ్చితంగా వర్మ హస్తం ఉందని చెప్పాలి. వర్మ సహాయ సహకారాలతోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించారు ఇలా పవన్ కళ్యాణ్ గెలవడంతో వర్మకు కూడా అక్కడ పూర్తిస్థాయిలో ప్రాధాన్యత తగ్గిపోయిందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఇతర శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు అన్నింటిని కూడా తన అన్నయ్య ఎమ్మెల్సీ నాగబాబుకు అప్పగించారు. ఇటీవల నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈయన నేడు అధికారకంగా ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొన్నారు..
ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో శుక్రవారం ఉదయం ఈయన అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఇలా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జై వర్మ అంటూ తెలుగుదేశం పార్టీ జెండాలతో నినాదాలు చేశారు.
ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో మరోవైపు జనసైనికులు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. నాగబాబు వీటిని పట్టించుకోకుండా తన కార్యక్రమాలలో బిజీ అయ్యారు. అయినప్పటికీ బయట ఉధృత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల వారిని శాంతింప చేశారు.
ఇలా నాగబాబు మొదటి ప్రభుత్వ కార్యక్రమంలోనే జనసైనికులు, తెలుగు తమ్ముళ్ల మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకోవడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందో అర్థమవుతుంది. మరి ఈ ఘటనపై నాగబాబు ఎలాంటి కామెంట్ చేయలేదు తదుపరి ఈ విషయంపై స్పందిస్తారేమో తెలియాల్సి ఉంది.
