Nagababu: ఇటీవల ఏపీలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల కూటమి పార్టీల నుంచి ఐదుగురు సభ్యులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ నుంచి నాగబాబు, బిజెపి నుంచి సోము వీర్రాజు, తెలుగుదేశం పార్టీ నుంచి బీటీ రాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు అయితే ఈ ఐదుగురు కూడా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎంపిక అయినట్టు తెలుస్తుంది.
ఇలా ఈ ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం అధికారకంగా తెలియచేయడమే కాకుండా గురువారం సాయంత్రం ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు రిటర్నింగ్ అధికారి నుంచి వీరంతా ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. ఇక ఈ ఐదుగురిలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబుకు మంత్ర పదవి కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
నిజానికి నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఎంపీ టికెట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే ఈయనకూటమి పార్టీలు విజయానికి ఎంతగానో దోహదం చేశారు. ఇలా పార్టీ కోసమే నాగబాబు అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని నాగబాబుకు క్యాబినెట్లో చోటు కల్పించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో భాగంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి అనంతరం మంత్రిగా క్యాబినెట్ లోకి తీసుకోవాలని ఆలోచన చేశారు ఇలా ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినటువంటి నాగబాబుకు త్వరలోనే ఇక మంత్రి పదవి కూడా రాబోతుందని తెలుస్తుంది అయితే ఈయనకు ఏ పదవి ఇవ్వబోతున్నారా అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. నాగబాబుకు క్రీడా శాఖ లేదా పర్యాటక శాఖ మంత్రిగా పదవి ఇవ్వబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.