మళ్లీ నిర్మాతగా మారిన నాగబాబు… ఈసారైనా హిట్ కొడతాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటుడిగా కొనసాగుతూనే అప్పట్లో పలు సినిమాలకు అంజన ప్రొడక్షన్స్ నుంచి నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈయన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు ఒక రకంగా ఇతనికి మంచి లాభాలను తీసుకువచ్చినప్పటికీ ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాతో భారీ నష్టాలను చవి చూశారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాగబాబును మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆ సమయంలో తనకు అండగా నిలబడ్డారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా భారీ డిజాస్టర్ అయిన తర్వాత నాగబాబు అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో మరో సారి నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సినిమా కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది.దీంతో నిర్మాణ రంగం వైపు రాకూడదని నాగబాబు భావించారు. ఇక ఈయన బుల్లితెర టీవీ కార్యక్రమాల ద్వారా బాగా సంపాదిస్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగానే సంపాదిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం నాగబాబు మరో సారి నిర్మాతగా మారినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ హీరోగా తన తదుపరి చిత్రం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కథ పరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి నాగబాబు ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ తో సంయుక్తంగా నిర్మించడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నిర్మించిన తొలిప్రేమ మంచి సక్సెస్ అందుకోవడంతో మరోసారి తనతో కలిసి నాగబాబు ఈ సినిమాను తెరకెక్కించాలని భావించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా అయిన నాగబాబు లాభాలను అందుకుంటారా..లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.