చరిత్రలో చిరస్మరణీయులు, స్వాంత్రత్య సమరయోధులు, గొప్ప నాయకుల గౌరవార్ధం అలాంటి వారిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా కరెన్సీ నోట్లపై, నాణాలపై వారి బొమ్మలను ముద్రిస్తుంటారు. ఏదేశానికి ఆ దేశం గొప్ప నాయకుల్ని బొమ్మల రూపంలో ముద్రించుకుని గౌరవించుకుంటుంది. కొన్ని దశాబ్ధాలుగా ఈ విధానం ప్రపంచ దేశాల్లో కొనసాగుతుంది. తాజాగా ఈ అంశంపై జనసేన నేత ఫైర్ బ్రాండ్ నాగబాబు తన నా ఇష్టం యూ ట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు. ఆయన ఏమన్నారంటే?..
కాయిన్స్ పై గాంధీ, ఇందిరాగాంధీ, జవహార్ లాల్ నెహ్రూ వంటి వారి బొమ్మల్ని ముంద్రించారు. మరి లాల్ బహదూర్ శాస్ర్తి, భగత్ సింగ్ లాంటి గొప్ప వాళ్లను ఎందుకు వదిలేసారు? వాళ్ల గొప్ప వ్యక్తులు కాదా? అందరికీ సమాన గౌరవం ఇవ్వాల్సిన బాద్యత సమాజం, ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని తనదైన శైలిలో స్పందించారు. మహమ్మదీయులపై చత్రపతి శివాజీ, రాణాప్రతాప్ సింగ్, బాజీరావ్ పేష్వా వంటి వారు యుద్ధాలు చేశారు. దేశం కోసం వాళ్లంతో ఎంతో శ్రమించారు. ఇంకా భారత్ లో ఇంకెంతో మంది సింగర్స్, రైటర్స్, సంఘ సంస్కర్తలు, క్రీడాకారులు ఉన్నారు. వాళ్లందర్నీ గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వారి బొమ్మల్ని కూడా నోట్లపై, కాయిన్స్ పై ముద్రిచాలన్నారు. ఇప్పటివరకూ చాలా ప్రభుత్వాలు వచ్చివెళ్లాయి తప్ప..వాళ్లకి సరైన గౌరవం దక్కలేదని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. గొప్ప వ్యక్తులను స్మరించుకునే మంచి పనులు కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేస్తుందన్నారు. విదేశాల్లో మన స్వాత్రత్య సమరయోధులకు ఎంతో మంచి పేరు, గుర్తింపు ఉందన్నారు. మన దేశ స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు నాగబాబు.