Nagababu: జగన్ మరో 20 ఏళ్లు కలలు కంటూనే ఉండు… వైసీపీ పై సెటైర్లు పేల్చిన నాగబాబు!

Nagababu: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జయకేతనం అనే కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ…

ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయన మాటలు వింటుంటే నవ్వు వస్తుందని తెలిపారు. అలాగే జగన్ భవిష్యత్తు గురించి కూడా నాగబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. జగన్ గత కొన్ని నెలలుగా ఎన్నో కలలు కన్నాడు.. మరో 20 సంవత్సరాలు అలాగే కలలు కంటూనే ఉండు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి నేనిచ్చే ఒక సలహా ఏంటంటే కలలు కనడం కొనసాగించు అంటూ నాగబాబు మాట్లాడారు.

ఇటీవల ఎన్నికల ఫలితాలు గురించి కూడా నాగబాబు మాట్లాడుతూ… ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుంది గత ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమయ్యేలా చెప్పారని తెలిపారు. కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని ఈయన కామెంట్లు చేశారు. ఇక జగన్ తిరిగి అధికారంలోకి వస్తాను అనుకోవడం ఒక కల మాత్రమేనని ఆయనకు తిరిగి అధికారం ఉండదని నాగబాబు తెలిపారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై కూడా ఈయన ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ పుట్టేటప్పుడు మా అమ్మకు కనీసం నొప్పి కూడా కలిగనివ్వలేదట అలాంటి వ్యక్తి ప్రజలకు మంచి చేసే నాయకుడిగా ఎదిగాడు జనసేనాని లాంటి వ్యక్తి నాయకుడిగా రావటం మన అదృష్టం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప నాయకుడు మనకు దొరకటం నిజంగా మన అదృష్టం అని తెలిపారు. ఇప్పటికే పవన్ మూడు తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అది ఆయన విజన్ అంటూ నాగబాబు తన తమ్ముడిపై ప్రశంసలు కురిపించారు. ఇలా నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.