Nag Heroine’s : నాగార్జున హీరోయిన్ ఆ ‘న్యూడ్’ షో ఎందుకు చేసిందంటే.!

Nag Heroine’s : ‘అన్నమయ్య’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కస్తూరి ఓ న్యూడ్ ఫోటో షూట్‌లో నటించింది. అనుకోకుండా ఆ ఫోటో బయటకి వచ్చేసింది. ఆ లీకేజీ ఫోటో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అప్పట్లో.
తన అనుమతి లేకుండా ఆ ఫోటో లీక్ చేసినందుకు కేసు పెడతానని కస్తూరి కూడా నానా యాగీ చేసింది. ఇదంతా 2014లో జరిగింది.
ఇంతకీ కస్తూరి ఆ న్యూడ్ ఫోటో షూట్ ఎందుకు చేయించుకున్నట్లు.? అంటే అదో మ్యాగ్జైన్ కోసం. ‘ది బాడీస్ ఆఫ్ మదర్స్ – ఏ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్’ అనే మ్యాగ్జైన్ కోసం కస్తూరి న్యూడ్‌గా నటించాల్సి వచ్చింది. అప్పట్లో ఇదో సంచలనం.
ఈ ఫోటో నెట్టింట్లో తెగ హల్ చల్ చేసింది. ఈ లీకేజీ విషయంలో న్యాయ పోరాటం వరకూ వెళతా.. అంటూ రచ్చ చేసిన కస్తూరి, ఆ తర్వాత కామ్ అప్ అయిపోయింది.
తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ, ఆ ఇష్యూని జనం కూడా మర్చిపోయారు ఆ తర్వాత. అయితే, ‘అన్నమయ్య’ వంటి ఓ ఆధ్యాత్మిక చిత్రంలో నటించిన కస్తూరిని అలా చూసేసరికి ఫ్యాన్స్ భగ్గుమన్న మాట వాస్తవమే. కానీ, అందాల భామలన్నాకా అన్ని రకాల ప్రాజెక్టుల్లోనూ నటించాల్సి వస్తుంది అవకాశాన్ని బట్టి.
అలాగే, కస్తూరి కూడా. అయితే ఓ మంచి కాన్సెప్టు కోసం చేసిన ఈ ఫోటో షూట్ లీక్ అయ్యి, బయటికి రావడంతో అనవసరమైన రచ్చకు కేంద్రమయ్యింది. ఏది ఏమైతేనేం, ఇష్యూ సద్దుమనిగిందనుకోండి.
ప్రస్తుతం కస్తూరి, బుల్లితెరపై ‘గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా ఇంటింటి గృహలక్ష్మిగా తెగ పాపులర్ అయిపోయింది. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది.