పెద్దరికం అంటే ఆయనది.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నటి కస్తూరి!

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణం, అల్లు అర్జున్ పై కేసు, అతని అరెస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వంటి వాటిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అందరికీ స‌మానమే. పోలీసులు తప్పకుండా భద్రత గురించి ఆలోచిస్తున్నారు.

థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌రఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు అని చెప్పుకొచ్చారు.దీనిపై ప్రముఖ నటి కస్తూరి స్పందించారు.

“పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన ప్రకటన చేశారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అంటూ కస్తూరి ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను గతానికి వదిలేసి 2025లోకి అడుగుపెడదాం అని కస్తూరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ని కూడా ఆమె షేర్ చేసింది. నటి కస్తూరీ ఈమధ్య ఏం మాట్లాడినా అదో సెన్సేషన్ అవుతోంది.

ఆ మధ్య తెలుగు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, చిక్కుల్లో పడిన ఆమె.. ఆ తర్వాత కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌ గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఇప్పటికే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలని నెటిజన్స్ పాజిటివ్ గా తీసుకుంటారో లేదంటే వీటిని కూడా కాంట్రవర్సీ చేస్తారో చూడాలి.