వామ్మో ఆశు రెడ్డికి పిచ్చి బాగా ముదిరిందే.. ఏకంగా ముద్దులు పెడుతూ రెచ్చిపోయిన అశు!

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఆశు రెడ్డి డబ్ స్మాష్ వీడియోల ద్వారా బాగా ఫేమస్ అయ్యి సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఆశు రెడ్డి నటించిన సినిమాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించినప్పటికీ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో ఆశు రెడ్డి కూడా ఒకరు. బిగ్ బాస్ లో పాల్గొన్న ఆశు రెడ్డి జూనియర్ సమంత లాగా ఫేమస్ అయ్యింది.

అయితే కొన్నిరోజులకే బిగ్ బాస్ ఇంటినుండి ఎలిమినేట్ అయ్యింది. అయినప్పటికీ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ వల్ల బాగా పాపులర్ అయింది. ఇలా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఆశు రెడ్డి బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో సందడి చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఆశు రెడ్డి చేసే అందాల ఆరబోతకి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. కొన్ని సందర్భాలలో ఈమె ధరించి దుస్తులు వల్ల విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆశు రెడ్డి షేర్ చేసిన ఒక పోస్ట్ వల్ల మళ్లీ విమర్శలు ఎదుర్కొంటోంది.

ఇటీవల ఆశు రెడ్డి ఒక పెట్ డాగ్ ని అడాప్ట్ చేసుకుంది. ఆ కుక్కకి ముద్దుగా రాజుగాడు అంటూ పేరు పట్టుకుంది. ఈ క్రమంలో ఆశురెడ్డి ఆ పెట్ తో ఎంతో చనువుగా ఉండేది. ఇటీవల ఆశు రెడ్డి పిచ్చి బాగా ముదిరినట్టు ఉంది. కుక్కకి మెడలో బంగారు నెక్లెస్ వేసి చేతులకు గాజులు కూడా తొడిగి దానిని సోఫాలో కూర్చోబెట్టి ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆశు రెడ్డి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మై బంగార్రాజు.. జంతువుల పట్ల మీ మనసులో ప్రేమను మీ పెట్స్ మీద చూపించండి..అవి ఎప్పుడు మీ ప్రేమను బ్రేక్ చేయవు” అంటూ ఒక టాగ్ లైన్ పెట్టేసింది. ఇక తన కుక్కని బంగార్రాజు అనటంతో నాగార్జున అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఆశు రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.