Lavanya Tripathi Pelli : తగ్గేదె లే.. మళ్లీ మొదలైన లావణ్య పెళ్లి గోల.!

Lavanya Tripathi Pelli :  కొన్ని రూమర్స్‌కి కొంతకాలం దాటితే చెక్ పడుతుంది. కానీ, కొన్ని కొన్ని రూమర్స్‌కి ఎప్పటికీ చెక్ వుండదు. అలాగే తయారైంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్లి గోల. అదిగో ఓ యంగ్ హీరోతో లావణ్య పెళ్లి అట.. అంటూ ఆ మధ్య చాలా గాసిప్స్ వినిపించాయ్.
కానీ, కొన్నాళ్లకి తూచ్.! అదంతా వుత్తదే.. అని తేలిపోయింది. జస్ట్ కామ్ అప్ అయ్యిందంతే. మళ్లీ ఇప్పుడు తాజాగా లావణ్య పెళ్లి గోల మళ్లీ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో, ప్రముఖ సినీ బ్యాక్ గ్రౌండ్ వున్న హీరోతో లావణ్య చెట్టా పట్టాలు వేసుకుని తీరుగుతోందనీ, వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్లకు సైతం హాజరవుతోందనీ గాసిప్స్ రావడంతో ఇంకేముంది.. ఆ యంగ్ హీరోని అందాల రాక్షసి పెళ్లాడబోతోంది.. అంటూ నెట్టింట రచ్చ మొదలైంది.
ఆ విషయంలో అటు ఆ యంగ్ హీరో కానీ, ఇటు లావణ్య త్రిపాఠి కానీ, స్పందించలేదు. స్పందించినా అసలు సమాధానం రానివ్వకుండా, లైట్ తీసుకునేలా రెస్పాన్స్ వచ్చిందంతే. సహజంగా వచ్చే సమాధానమే అంది. మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే.. మా మధ్య ఎలాంటి ఎఫైర్లు లేవు.. అంటూ సహజంగా ఇలాంటి రూమర్లు ఎదుర్కొనే సెలబ్రిటీలు చెప్పే మాటలే చెప్పి ఎస్కేప్ అయ్యారీ జంట.
అయితే, ఈ సారి నో వే.. టార్గెట్ మిస్ కాకూడదంతే.. అనేలా తాజాగా మరోసారి ఈ జంటను టార్గెట్ చేసింది సోషల్ మీడియా. సేమ్ టు సేమ్ ఈ జంట పెళ్లి ముచ్చట నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మరి, ఈ సారైనా లావణ్య త్రిపాఠి నుంచి అసలు సిసలు క్లారిటీ వస్తుందా.? చూడాలిక.