నాగార్జున కి కొత్త తలనొప్పి తెచ్చిన అఖిల్

హీరోగా, బిజినెస్ మాన్ గా తిరుగులేని నాగార్జున కు తన కొడుకుల వల్ల ప్రశశాంతత లేకుండ పోయింది. తన కొడుకుల్ని స్టార్ హీరో లు గా తీర్చి దిద్దాలనుకున్న నాగార్జున కల ఇంకా అలానే ఉంది. అఖిల్, నాగ చైతన్య ఇంకా స్టార్ హీరోలు కాలేకపోయారు. నాగచైతన్య కొన్ని హిట్స్ ఇచ్చినా కానీ, స్టార్ కాలేకపోయాడు, అఖిల్ అయితే ఇప్పటివరకు కనీసం ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు.

ప్రొఫెషనల్ లైఫ్ ఎలాగున్నా నాగ చైతన్య పర్సనల్ లైఫ్ కూడా బాలేదు. సమంత తో విడాకులు నాగార్జునని తీవ్రంగా కలిచివేసింది. పాపం అక్కినేని నాగార్జున ఒకటి పోతే ఒకటి సమస్య ఎదురవుతూనే ఉంది . కొన్ని సమస్యలు తనకు తానుగా తెచ్చుకుంటే మరికొన్ని తన పుత్ర రత్నాలు తెచ్చిపెడుతున్నారు.

రీసెంట్ గా అఖిల్ నాగార్జునకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టినట్టు తెలుస్తుంది. అఖిల్  ఓ పబ్ లో రచ్చ రచ్చ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అఖిల్ రీసెంట్ గా ఓ పబ్ లో ఓ వ్యక్తితో తాగేసి రూడ్ గా బిహేవ్ చేసిన్నత్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.