ఈ నేత జనసేనకు భారీ షాక్ ఇవ్వనున్నారట.. ?

Janasena activists counter attack on Sakshi media

 

నడిసంద్రంలో నావలా జనసేన పరిస్దితి మారిందంటున్నారట విశ్లేషకులు.. ఒక వైపు టీడీపీ, మరో వైపు బీజేపీ ఈ రెండు పార్టీలకు మధ్య వారధిగా జనసేన ఉంటుందనే ప్రచారం తరచుగా వినిపిస్తూనే ఉంది.. అసలు ప్రజల్లోకి జనసేన పార్టీ ఏ ఉద్దేశ్యంతో వచ్చిందో ఇప్పటికి అర్ధం కాకుండా కూడా కొందరు ఉన్నారట.. ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న కమళంతో దోస్తీ చేసి, టీడీపీని తన షాడోగా మోసుకుంటున్న జనసేన అధినేతకు అభిమానులు అయితే లెక్కలేనట్లుగా ఉన్నారు.. కానీ ఎందుకో రాజకీయంగా మాత్రం ఈ ఫాలోయింగ్ పనిచేయడం లేదంటున్నారట విశ్లేషకులు..

ఇప్పటికే ఏదో నాంకే వాస్తంగా ఉన్న ఈ పార్టీకి నాయకులే కరువైన నేపధ్యంలో మరో కీలక నేత పార్టీ మారనున్నారనే ప్రచారం ఊపందుకుంటుందట.. ఆ నేత ఎవరని ఆరా తీస్తే నాదెండ్ల మనోహర్ అని తేలిందట.. ఇక పవన్ ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా గానీ, రాష్ట్రంలో వివిధ సమస్యలపై సమావేశాలు కానీ, ఆందోళనలు, ఉద్యమాలు కానీ, చర్చలు కానీ, ఇలా ఏదైనా జరిగిన నాదెండ్ల మనోహర్, పవన్ పక్కన ఉండాల్సిందే. అంతగా పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే జనసేనలో పవన్ తర్వాత అన్నీ తానే వ్యవహరిస్తూ, జనసేన రాజకీయంగా మరింత ముందుకు తీసుకెళ్ళే విషయంలో ముందుంటారనే టాక్ ఉంది..

అంతటి ప్రాముఖ్యత కలిగిన నాదెండ్ల మనోహర్ కు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ భవిష్యత్ పై అనుమానాలు పెరిగిపోతుండటం, మరోవైపు బీజేపీ జనసేన విషయంలో అనుమానం ఉండటం వంటి కారణాలతో గత కొంత కాలంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయట.. ఈ నేపధ్యంలో ఆయన వైసీపీ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరిపినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాని ఈ విషయాన్ని అధికారికంగా ఎవరు మాట్లాడేందుకు ఇష్టపడక పోయినప్పటికీ, ఆయన రాకకు వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ పడిందని, దసరా తర్వాత ఆయన చేరిక ఉండవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయట..

ఒకవేళ ఇదే జరిగితే జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఇప్పటికే పవన్ చుట్టూ ఉన్న కీలకమైన వ్యక్తులు దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఒక్కరే పవన్ కు అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన కూడా వెళ్లిపోతే జనసేన జనాల్లో తప్ప అధికారంలో, పదవుల్లో జీరో సేనగా మారే అవకాశం ఉందట.. మొత్తానికి ఈ విషయం జనసేన పార్టీ అధినేతకు షాకింగ్ న్యూసే..