Mysore Pak: భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ ఎంతటి సంచలనాలను రేపిందో మనకు తెలిసినదే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార చర్యలను చేపట్టింది. ఇలా మూడు రోజులపాటు పాకిస్తాన్ భారత్ మధ్య భయంకరమైనటువంటి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడులలో భాగంగా ఎంతో మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు అలాగే ఉగ్రవాదులు కూడా మరణించారు.
ఇలా భారత పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్నటువంటి యుద్ధం అనంతరం భారతదేశంలో పాకిస్తాన్ కి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పేర్లను కూడా మార్చేశారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ జైపూర్ లోని స్వీట్ షాప్ ఓనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ భారత్ యుద్ధం అనంతరం కొన్ని స్వీట్లకు కూడా పేర్లను మార్చారు.
ఇందులో భాగంగా మైసూర్ పాక్ పేరును కూడా మార్చేశారు. మైసూర్ పాక్ అనేది ఎంతో ఫేమస్ అయిన స్వీట్ కానీ ఈ పేరులో పాక్ అని ఉండటంతో ఇది కాస్త పాకిస్తాన్ ను సూచిస్తుంది అన్న నేపథ్యంలోనే మైసూర్ పాక్ లో పాక్ తీసేసి మైసూర్ శ్రీ అనే నామకరణం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ప్రతి భారతీయుడులో కూడా దేశభక్తి నిండి ఉందనీ స్పష్టమవుతుంది.
ఇలా మైసూర్ పాక్ లో పాక్ అంటే పాకిస్తాన్ని సూచించడం కాదు.కన్నడలో తీపి అని అర్థం. కర్ణాటకలోని మైసూర్ (ఇప్పుడు మైసూరు) నుంచి వచ్చే పాల పొడితో ఈ స్వీట్ చేస్తారు. ఇక పాక్ అనేది రెసిపీలో ఉపయోగించే చక్కెర సిరప్‌ను సూచిస్తుంది. అలా ఈ స్వీట్ కి మైసూర్ పాక్ అనే పేరు వచ్చింది.