Fidha Movie: తనకు ప్రారంభం నుంచీ సినిమాలో నటించాలంటే అస్సలు భయపడలేదని ఫిదా ఫేమ్, ఆర్టిస్ట్ గీత అన్నారు. తన భర్త చనిపోయిన సందర్భంలోనే తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా బాగా హిట్ కొట్టబోతోందన్న విషయం తమకు తెలిసిందని ఆమె చెప్పారు. ఆడియో రిలీజ్ రోజే ఈ చిత్రం మంచి విజయాని సాధిస్తుందని తామందరూ ఊహించామని ఆమె అన్నారు. సినిమా మంచి హిట్ అవుతుందన్న సంతోషం ఒక పక్క, తన భర్త లేరన్న బాధ మరో పక్క, అదే సమయంలో తనకు ఫిదా సినిమాలో అవకాశం రావడం వెంట వెంటనే జరిగిపోయానని ఆమె అన్నారు.
అలా అన్నీ ఒకే సారి వచ్చేసరికి తనకు నిజంగా ఏడవాలో, సంతోషించాలో అర్థం కాలేదని గీత చెప్పారు. అసలు ఆ భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తనకు తెలిసేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే ఫిదా సినిమా బాన్సువాడ అనేసరికి తాను వెళ్లిపోయానని, అక్కడ తనకు కొంచెం ప్రైవసీ దొరికిందని ఆమె అన్నారు. అక్కడ చిత్ర యూనిట్ మొత్తం ఒక ఫ్యామిలీలాగా ఉండేవారన్న గీత, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని, తాను డైలాగ్ చెప్పడంలో వాళ్లకేమైనా ఇబ్బంది పెట్టానేమో గానీ, తనకు ఎలాంటి
ఇబ్బందీ కలగలేదని ఆమె స్పష్టం చేశారు.
ఒక్క విషయమేమిటంటే అనుకున్నదానికంటే షూటింగ్ కొంచెం లేట్ అయిందని, తాను ఒక్క దగ్గర మాత్రం వాళ్లకు టైం ఇవ్వలేకపోయానని ఆమె తెలిపారు. వాళ్లు ఆ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యారని, ఎలాంటి ఇష్యూస్ జరగలేదని ఆమె చెప్పారు. తరుణ్ భాస్కర్ అప్పటికే పెళ్లి చూపులు హిట్ కావడంతో అదే సంతోషంలో ఉండి, అమ్మ ఇలా యాక్ట్ చేస్తుందని గానీ, ఇంకేం ఫీల్ అయినట్టు గానీ లేనట్టు తనకు అనిపించిందని ఆమె చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం తాను ఒక్క ఇంటర్వ్యూకు వెళ్తున్నానంటే మాత్రం వద్దు ఇంట్లో రిలాక్స్‌గా ఉండు అని అంటాడని ఆమె అన్నారు. అప్పట్లో వాడు కొంచె ఆ సినిమాలో బిజీగా ఉండడం వల్ల అలా ఉన్నాడేమోనని ఆమె వెల్లడించారు.