మాంసాహారం అంటే ఇష్టం లేని వాళ్లు ఎవ్వరూ ఉండరు. చికెన్ కంటే కూడా ఎక్కువగా మటన్ ను ఇష్టపడుతుంటారు. మటన్ శరీరానికి తగిన ప్రొటీన్లను ఇవ్వడమే కాదు… శరీర నిర్మాణ ప్రక్రియలో ఎంతో తోడ్పడుతుంది. మటన్ తో ఎన్నో రకాల వంటలు వండుతారు. మామూలు మటన్, తలకాయ కూర, కాళ్ల కూర, బోటీ అంటూ రకరకాలుగా వండుతుంటారు.
అయితే.. మామూలుగా తినే మటన్ కంటే మటన్ సూప్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. మటన్ సూప్ అంటే ఇంకేదో అనుకునేరు.. మటన్ సూప్ అంటే కాళ్ల సూప్ అదేనండి.. పాయా అంటారు కదా అదే. మేక కాళ్ల సూప్ వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఇప్పుడే వెళ్లి తెచ్చుకొని తినేస్తారు.
అయితే.. మిరియాలు, ఉలవలు కలిపి చేసే సూప్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయట. ఈ సూప్ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీర పోషణ కూడా పెరుగుతుంది. ఈ సూప్ లో ఉండే గ్లూకోసమైనన్, హైఅలురోనిక్ యాసిడ్, కొండ్రోయిటిన్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఎక్కువగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు మేక కాళ్ల సూప్ తాగాలని డాక్టర్లు కూడా సలహా ఇస్తుంటారు. ఆ సూప్ తాగిన వెంటనే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.