AP: ముద్రగడ ఇంటిపై దాడి… స్పందించిన ముద్రగడ్డ కుమార్తె క్రాంతి…. ఏమన్నారంటే?

AP: వైసీపీ, నాయకుడు కాపు ఉద్యనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్త దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన ట్రాక్టర్ తో ఇంటి గేటు బద్దలు కొట్టుకొని ఇంటిముందు పార్క్ చేసి ఉన్నటువంటి కారును ఢీ కొట్టారు దీంతో కారు భారీగా డామేజ్ అయింది అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా చింపివేసి జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇలా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి పై దాడి జరగడంతో ఒక్కసారిగా ఏపీ ఉలిక్కిపాటుకు గురి అయింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే వైకాపా నాయకులందరూ ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శించారు .అనంతరం ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ఉద్దేశపూర్వకంగానే ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగిందని స్పష్టమవుతుంది అయితే ఈయన ఇంటిపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటారో ఆయా సమయంలో కూడా తన ఇంటిపై దాడి జరిగింది అంటూ తెలియజేశారు. ఇక తాజాగా ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరగడంతో ఆయన కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి స్పందించారు.

ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరగటాని తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇలాంటి దాడులను మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహించరని తెలిపారు. ఈ దాడి వెనుక ఎంతటి వారు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈమె డిమాండ్ చేశారు. తన తండ్రి ఇంటిపై ఇలాంటి దాడి జరగడం బాధాకరం అయితే డబ్బులు ఇచ్చి జనసేన కార్యకర్తలు ఇలా చేయించారు అని చెప్పటం బాధాకరమని పోలీసులు వెంటనే దర్యాప్తు జరిపి దీని వెనుక ఉన్నది ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.