ఇన్నాళ్ళకు పెద్ద పాయింట్‌లో జగన్‌కు చిక్కిన రాజుగారు

MP Raghuramkrishana Raju mistake gone viral
స్వపక్షంలోనే విపక్షం అన్నట్టు తయారైన రెబల్ ఎంపీ రఘురామరాజు అనేక విషయాల్లో అధికార పక్షం వైసీపీని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  పాలక పక్షం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఏదో ఒక తప్పును, లోపాన్ని వెతికిపట్టుకునే రాజుగారు దాన్ని నేరుగా మీడియా ముందు పెట్టి జగన్ సర్కార్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  ఇంగ్లీష్ మాధ్యమం మొదలుకుని రాజధాని తరలింపు, 3 రాజధానుకు, ఇళ్ల పట్టాల పంపిణీ, భూమిలిచ్చిన రైతులకు కౌలు చెల్లింపులో ఆలస్యం ఇలా అనేక విషయాల్లో రఘురామరాజు అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ ప్రభుత్వం నుండి సమధానాలు రాలేదు.  ముఖ్యంగా షోకాజ్ నోటీసుల విషయంలో రాజుగారు చేసిన హడావుడికి, లాగిన లా పాయింట్లకి వైసీపీ పేరుకే ప్రమాదం వాటిల్లినంత పనైంది. 
MP Raghuramkrishana Raju mistake gone viral
MP Raghuramkrishana Raju mistake gone viral
 
దీన్నిబట్టి రెబల్ ఎంపీ విమర్శనా పటిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  కానీ అన్నిసార్లు సమయం కలిసిరాదు.  ఎప్పుడూ పైచేయి సాధించేవారు కూడ అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటారు.  సరిగ్గా ఇదే జరిగింది రఘురామరాజు విషయంలో.  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రాజుగారు ఎంచుకున్న కొత్త అంశం మద్యం.  మద్యనిషేధం అంటున్న ఏపీ సర్కార్ మద్యం ధరలను విపరీతంగా పెంచడమే కాకుండా రెగ్యులర్ పాపులర్ బ్రాండ్లను దొరక్కుండా చేశారు.  ఇదే అదునుగా కొత్త కొత్త లోకల్ బ్రాండ్లు పుట్టుకొచ్చాయి.  వాటిలో భూమ్, ప్రెసిడెంట్ మెడల్, 8 పిఎం లాంటి చిత్ర విచిత్రమైన పేర్లతో మద్యం ఉత్పత్తి అవుతోంది.  ఈ మద్యం మీద జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  అంతంత డబ్బు పెట్టి కొనినా మంచి మద్యం దొరకడం లేదని వాపోతున్నారు.
 
ఇదే విషయాన్ని చర్చకు తెచ్చిన రాజుగారు ఒకే కంపెనీలో తయారవుతున్న మద్యం బ్రాండ్లు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఎక్కడాలేని విచిత్రమైన బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని అంటూ కొన్ని మద్యం బ్రాండ్ల పేర్లు ప్రస్తావించారు.  అవి తాగితే రెండు మూడేళ్లలో ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుందని చెప్పుకొచ్చారు.  ఇక్కడే రాజుగారు బుక్కయ్యారు. ఆయన ప్రస్తావించిన, ప్రజల ప్రాణాలు తీస్తాయన్న బ్రాండ్లలో కొన్ని చంద్రబాబు హాయాంలో వచ్చినవే.  వాటిని జగన్ హాయాంలో వచ్చినట్టు మాట్లాడారు ఆయన.  దీంతో చాలామంది చంద్రబాబు బ్లాండ్లను జగన్ ఖాతాలో ఎందుకు వేస్తున్నారని అంటే కొందరు మాత్రం ఏదైనా చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి కదా రాజుగారు.. ఈ విషయంలో మీరు జగన్ చేతికి దొరికేశారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.