నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటకొచ్చేసిన నేపథ్యంలో అదిష్టానం షోకాజ్ నోటిసులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో వైకాపా సంధించిన అన్ని ప్రశ్నలకు రఘురాం బధులివ్వాలని కోరింది. తాజాగా వాటిపై రఘురాం ఘాటుగా స్పందించారు. వైకాపా పంపిన నోట్ కు చట్టబద్దత లేదన్నారు. తాను శ్రామిక రైతు కాంగ్రెస్ తరుపును పోటీ చేసానని అలాంటప్పుడు అదిష్టానానికి తాను ఎందుకు బధులివ్వాలన్నారు. నోటీస్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని, లెటర్ హెడ్ కు , బీఫామ్ కు తేడాలున్నాయన్నారు. అలాంటప్పుడు వైకాపా తరుపున నోటీస్ ఎలా పంపుతారని ప్రశ్నించారు.
వైకాపాకు క్రమ శిక్షణ సంఘం అంటూ ఒకటి ఉందా? ఉంటే ఆసంఘం చైర్మన్ ఎవరు? విజయసాయి రెడ్డిని ఉద్దేశించి కౌంటర్ వేసారు. ఈ నోటీస్ ను వైకాపా పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి ఇచ్చారు. కానీ ఇది రాష్ర్టీయ పార్టీ అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా నోటీసులిస్తారని ప్రశ్నించారు. క్రమశిక్షణా కమిటీ కింద పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అధికారం గానీ, చట్టపరమైన అనుమతులు ఉండవని లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి పార్టీని ధిక్కరించి మాట్లాడినట్లు నోటీసు ఇచ్చారు. దీనికి సమాధానం ఇస్తానని చెప్పిన రఘురం ఇప్పుడు ప్లేటు ఫిరాయించి పార్టీనే తిరిగి ప్రశ్నించారు. దీంతో ఈ సీన్ మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.
రఘురాం పార్టీపై విమర్శలు, ఆరోపణలు మొదలెట్టిన నాటి నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అదే స్పీడ్ లో కౌంటర్లు వేస్తున్నారు. అదిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కూడా రఘురాం బెదరలేదు. సున్నితంగా అదిష్టానానికి వివవరణ ఇస్తారని పార్టీ నేతలు భావించారు. కానీ ఆయన ఊహించని విధంగా ప్రతిదాడికి దిగారు. మరి ఈ లేఖపై విజయసాయి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే రఘురాం తనకి రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.