AP: గత ప్రభుత్వ హయామంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి ఒకరు. అయితే గత ఏడాది ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఈయన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఓటు వేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని గుర్తించిన వైసీపీ నేతలు ఆనం రామనారాయణరెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే మరో మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై కూడా వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఇలా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని సస్పెండ్ చేయడంతో వీరంతా తెలుగుదేశం పార్టీలోకి చేరారీ. తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన కోటంరెడ్డి ఆనం ఇద్దరూ కూడా గెలిచి మంత్రులుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి దేవదాయ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆనం రామనారాయణరెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని భ్రష్టు పట్టించాడని ఆనం తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అంటే గౌరవం లేదని తెలిపారు. జగన్ పత్రికా సమావేశాలు పెట్టి అడిగితే.. చట్ట సభల్లో జవాబు చెప్పమనడం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదని తెలిపారు.
వీలైనంత త్వరగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది అంటో ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా వైసిపి అభిమానులు ఈయన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.