Crime News: మద్యం మత్తులో కసాయి గా మారిన తల్లి.. మూడేళ్ల చిన్నారిపై దారుణం..!

Crime News: మద్యం అలవాటు వల్ల ప్రతి రోజూ అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో మందు తాగటం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మద్యానికి బానిసలు గా మారుతున్నారు. సాధారణ మగవారు మద్యానికి అలవాటు పడటం అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ మధ్య కాలంలో మహిళల కూడా మద్యం సేవించడానికి బాగా అలవాటు పడుతున్నారు.తాజాగా జరిగిన ఒక సంఘటన ఇందుకు నిదర్శనం.

వివరాలలోకి వెళితే.. మద్యం మత్తులో ఉన్న మహిళ కన్న కూతురి పట్ల కర్కశంగా ప్రవర్తించిన తీరు అందరిని
ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణ మెదక్ జిల్లా కేంద్రంలో ఇటీవల చోటు చేసుకుంది.హవేలి ఘణపూర్‌ మండలం, పోచమ్మరాల్ గ్రామానికి చెందిన కవిత అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు. ఈమె పని చేయకుండ రోజు యాచిస్తు వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఇలా కష్టం లేకుండా డబ్బు రావటంతో కవిత మద్యానికి బాగా అలవాటు పడింది. మద్యం మత్తులో తరచూ పిల్లలని చిత్ర హింసలకు గురిచేస్తూ ఉండేది.

ఇటీవల బుదవారం రాత్రి కవిత మద్యం మత్తులో కళ్ళు మూసుకుపోయి తన మూడేళ్ల కూతురి మీద దారుణానికి పాల్పడింది. చిన్నారికి మందు తాగించి విచక్షణా రహితంగా కొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారి కి దెబ్బలు తగలటం చూసిన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తలించరు. ముఖం, తల భాగాల్లో తీవ్ర గాయాలు అవ్వటంతో సిటీ స్కాన్ చేయాలని డాక్టర్లు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్‌ సమీఉద్దీన్‌ వెంటనే ఆస్పత్రికి వెళ్లి చిన్నారికి సీటీ స్కాన్‌ చేయించారు. పిల్లల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తించిన తల్లిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.