Suicide:ఈ ఆధునిక కాలంలో నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఎటువంటి విలువ ఇవ్వని వారు చాలామంది ఉన్నారు . ప్రేమలు, ప్రేమ వివాహాలు, వేరే కులపు వారిని పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు తల్లిదండ్రులు ఎవరు చూపిస్తే వారిని పెళ్లి చేసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా తయారయ్యింది. ప్రేమ వివాహాలు విపరీతంగా పెరిగిపోయాయి. సంప్రదాయాలను కాలారాస్తూ ఎవరి ఇష్టానికి వారు పెళ్లి చేసుకుంటున్నారు.
యువత ఎక్కువగా ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రేమ వివాహాలు అయితే అమ్మాయి గురించి అబ్బాయి కి అబ్బాయి గురించి అమ్మాయి కి అవగాహన వస్తుంది అనే అపోహలో చాలా మంది ఇలా ప్రేమ వివాహాల వైపు మల్లుతున్నారు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే ఒకరి గురించి ఒకరికి ఎక్కువగా తెలియదు అని వారి భావన. తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితుల వల్ల సమాజం లో పరువు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమ వివాహాల వల్ల ఎన్నో పరువు హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయి.
ఇలాంటి పరిస్థితే కామరెడ్డి లో జరిగింది. నవ మాసాలు మోసి, కనీ, పెంచి పెద్ద చేసిన ఓ తల్లిని కాదు అని ఒక కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి మనస్తాపం తో ఉరి వేసుకొని చనిపోయింది. కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడ కు చెందిన బుంది గంగయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు భార్య గంగవ్వ , కుమారుడు , కుమార్తె ఉన్నారు. ఎస్సై మధుసూదన్ గౌడ్ తెలిపిన వివరాల మేరకు గంగయ్య కుమారుడు తరుణ్ నిజామాబాద్ జిల్లా మోస్రాకు చెందిన ఒక యువతిని కొద్దిరోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడు గంగవ్వ కృంగిపోయేది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.