Avathar 2 :విజువల్ వండర్ “అవతార్ 2” పై బయటకొచ్చిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ మీకోసం.!

Avathar 2 : హాలీవుడ్ సినిమా దగ్గర వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విజువల్ వండర్ సినిమాల్లో ఒకటి “అవతార్”. దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా 2009లో రిలీజ్ అయ్యి మరో ప్రపంచం లోకి ఆడియెన్స్ ని ఈ చిత్రం తీసుకెళ్లింది. ఇక ఇదిలా ఉండగా నిన్ననే ఈ భారీ సినిమా నుంచి కొంతమంది సినీ ప్రముఖులకు గాను ఒక బిగ్ స్క్రీన్ పై 3డిలో అవతార్ 2 గ్లింప్స్ ని స్పెషల్ షో వేస్తున్నారన్న వార్తలతో మరోసారి ఒక్క మన దగ్గర మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఈ సినిమా పేరు గట్టిగా వినిపించింది.
దీనితో ఈ భారీ సినిమా గ్లింప్స్ ప్రసారం అయ్యే సమయంలోనే మరిన్ని ఆసక్తికర క్రేజీ అప్డేట్లు ఈ సినిమాపై బయటకి వచ్చాయి. అయితే ఈ సినిమాని దర్శకుడు అధిక శాతం నీటికి సంబంధించి తెరకెక్కించగా దానితోనే ఈ సినిమా టైటిల్ ని “అవతార్ ది వే ఆఫ్ ది వాటర్” గా పెట్టారట.
అలాగే ఈ సినిమా మొదట మూడు దేశాలు జర్మనీ, ఫ్రాన్స్ మరియు స్వీడన్ లలో రెండు రోజులు ముందు అంటే డిసెంబర్ 14న రిలీజ్ అవుతుందట. అలాగే నిన్న ప్రసారం చేసిన గ్లింప్స్ అయితే ఏకంగా 13 నిముషాలు చూపించారని ఒక రూమర్ ఉంది. అయితే నిన్న కొంతమందికే చూపించారు.
మరి మిగతా ప్రపంచం ఈ ట్రైలర్ చూసేది ఎప్పుడు అంటే దానికి మే 6నే ఫిక్స్ చేసారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ చిత్రంలో మరిన్ని వింత జంతువులను నీటిలో చూపించనుండగా మరికొందరు ప్రముఖ స్టార్ లు ఉంటారట.
వారిలో టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఫైనల్ గా అయితే అవతార్ మిగతా మూడు భాగాలూ రెండేసి ఏడాదిలు గ్యాప్ ఇచ్చి 2028 తో నాల్గవ భాగాన్ని రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారట. ఇవే ఈ సినిమాపై బయటకి వచ్చిన కీలక అప్డేట్లు.