పురుషులందు పుణ్యపురుషులు వేరయా…ఎమ్మెల్యేలందు ఈ ఎమ్మెల్యే వేరయా అని చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి పేరు వస్తుంది. ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే గా పనిచేస్తున్న ఆయన ఒక డిఫరెంట్ ఎమ్మెల్యే అనే చెప్పుకోవాలి. తన తండ్రి కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి 2006 లో హత్యకు గురికావడంతో అప్పటిదాకా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ జాబ్ చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటున్న వెంకట్రామి రెడ్డి అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేశాడు.
2009 ధర్మవరం నుండి గెలిచిన అయన నియోజవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశాడు , గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతి రోజు నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునే కార్యక్రమం మొదలుపెట్టాడు. అది మొదలు ఇప్పటిదాకా ఆయన ఏమి చేసిన కొత్తగానే ఉంటుంది. ఖరీదైన కారులో ధర్మవరం రోడ్లమీద పరుగులు తీసిన, గుర్రం ఎక్కి స్వారీ చేసిన, బుల్లెట్ పై సవారీకి వచ్చిన ఆయనకే చెల్లింది. అలాగని ఆయన యమా కాస్టలీ గురు అనుకోవటానికి లేదు, చేతిలో ఒక పేపర్ పట్టుకొని టీషర్ట్ ట్రాక్ ప్యాంటు వేసుకొని రోడ్ల మీదకు వచ్చి బడ్డీ కొట్టులో టీ తాగివెళ్ళిపోయే నైజం కూడా ఆయన సొంతం.
రాజకీయ నాయకుడు అంటే ఖద్దరు చొక్కాలు చుట్టూ మంది మద్బలం లాంటి వాటికీ ఆయన చాలా దూరం, అదే సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించటంలో కూడా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి శైలి కూడా వేరు, సమస్యలు ఆయన వద్దకు రాకముందే, ఆయనే సమస్య వద్దకు వెళ్లి పరిష్కరించే నాయకుడు. అందుకే ధర్మవరం ప్రజలు ఆయనకు పదే పదే పట్టం కడుతున్నారు, ధర్మవరంలో ఆయన్ని ఢీ కొట్టే సత్తాలేక గత ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీచేసిన గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీ లోకి వెళ్ళిపోయాడు, ఇక పరిటాల శ్రీరామ్ ను ధర్మవరం బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి తెచ్చిన కానీ, శ్రీరామ్ అందుకు సుముఖంగా లేకపోవటానికి కారణం కేతిరెడ్డి కి ధర్మవరంలో ఉన్న ప్రజాబలమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2024 లో మళ్ళి వైసీపీ పార్టీ అధికారంలోకి కేతిరెడ్డి మంత్రి కావటం ఖాయమని ధర్మవరంలో ఆయన అనుచరులు ఇప్పటినుండే చెప్పుకోవటం విశేషం..