Crime News:ఒడిశా రాష్ట్రంలోని ఖోర్ధా జిల్లా బాన్‌పూర్ బ్లాక్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది.ఈ ఘటనలో సామాన్య ప్రజల మీదకు దూసుకెళ్లిన కారు బీభత్సం సృష్టించింది. అయితే ఈ ఈ కారు చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు కావటం గమనార్హం. వివరాలలోకి వెళితే ఖుర్దా జిల్లాలో పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో బానాపుర్ బ్లాక్ ఆఫీస్ ఎదుట పార్టీ కార్యకర్తలు నిలబడి ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు జనాల మీదికి విధంగా తీసుకుని వెళ్ళింది.
కారు వేగంగా జనాల మీదికి వెళ్ళటం దూసుకెళ్లడంతో పదిహేను మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.ఈ ఘటనలో కార్యకర్తలతోపాటు బానాపూర్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఆర్ సాహు సహా ఏడు మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన కార్యకర్తలు ఎమ్మెల్యే మీద దాడికి దిగారు. ఎమ్మెల్యే కారు ధ్వంసం చేసి.. ఎమ్మెల్యే మీద దాడికి దిగారు. ఈ ఘటన సమయంలో ప్రశాంత జగదేవ్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు పేర్కొంటున్నారు.
అక్కడి స్థానికులు దాడి చేయడంతో ఎమ్మెల్యే ప్రశాంతి చేస్తే తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే నీ చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.