ఆర్మాక్స్ ర్యాంకింగ్ టాప్ ఫైవ్ లో మాయమైన ఎన్టీఆర్ పేరు.. నెలలోనే ఇంత మార్పా?

ప్రతి సంవత్సరం ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ పాన్ ఇండియా హీరోల ర్యాంకింగ్స్ విడుదల చేసే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆర్మాక్స్ సంస్థ దేశవ్యాప్తంగా పాపులర్ హీరోల ర్యాంకింగ్స్ విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల అభిప్రాయం ప్రకారం హీరోలకి ఈ ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. ఇటీవల కూడా ఈ సంస్థ ప్రేక్షకుల అభిప్రాయాలని సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ హీరోలకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కి చెందిన కొందరు స్టార్ హీరోలు ఈ ర్యాంకింగ్ లో స్థానం సంపాదించుకున్నారు.

ఆర్మాక్స్ సంస్ధ ఇటీవల పాన్ ఇండియా హీరోల లేటెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ ఏప్రిల్ 2022 న మొదట విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్ లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇండియా వైడ్ పాపులారిటీలో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఒక్క పాన్ ఇండియా సినిమా హిట్ లేకున్నా కూడా నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక మరొక స్టార్ హీరో ప్రభాస్ అప్పుడు మూడవ స్థానం దక్కించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ 4వ ర్యాంక్, అక్షయ్ కుమార్ 5వ ర్యాంక్ దక్కించుకున్నారు. ఆ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 7 వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు.

ఇదిలా ఉండగా ఆర్మాక్స్ సంస్ధ మే నెలలో కూడా ఇండియా వైడ్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్ విడుదల చేసింది. నెల వ్యవధిలోనే ఈ ర్యాంకింగ్స్ లో చాలా మార్పులు వచ్చాయి. 2 వ స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 6 స్థానం దక్కించుకోగా..7వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ 9 వ స్థానంలో ఉన్నాడు. ఇక విజయ్ ఇప్పుడు కూడా మొదటి స్థానంలో అలాగే స్థిరంగా ఉన్నాడు. అప్పుడు మూడవ స్థానంలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు 2 వ స్థానంలో నిలిచాడు. ఇక అప్పుడు టాప్ 10 లో ఉన్న అజిత్, అక్షయ్ కుమార్ ఇప్పుడు టాప్ 5 స్థానంలో నిలిచారు. ఒక్క నెల వ్యవధిలోనే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్థానం తారుమారయ్యింది.