సినీ కార్మికులతో వెంటనే చర్చలు జరపండంటున్న మంత్రి తలసాని..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులంతా ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఈ విషయం గురించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

కోవిడ్ ప్రభావం వల్ల సినిమా కార్మికులంతా ఇబ్బందుల్లో ఉన్నారు అని.. ఆ సమయంలో సినిమాలు లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని.. కాబట్టి కార్మిక సంఘాలతో వెంటనే ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడదు అని.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.