AP Minister Savitha: బొకే ఇచ్చిన ఎమ్మార్వో… విసిరి కొట్టిన మంత్రి సవిత… మంత్రిగారు ఇది తగునా?

AP Minister Savitha: ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యవహార తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు కారణం అవుతుంది. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గారికి ఎమ్మార్వో సాదర స్వాగతం పలుకుతూ పూల బొకే ఇచ్చారు. కానీ మంత్రిగారు ఆ పూల బొకేని తిరిగి విసిరి కొట్టడంతో ఇది కాస్త సంచలనగా మారింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మంత్రి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

జూన్ 1వ తేదీన మంత్రి సవిత గారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చేతన్ గారి సమక్షంలో తహశీల్దార్ శ్రీధర్ గారు మంత్రికి బొకే అందించగా ఆమె ఆ బొకేను తీసుకొని తన సిబ్బందికి ఇవ్వలేదు అలాగే పక్కన పెట్టలేదు చాలా కోపంతో ఆ బొకే తీసుకొని వెనక్కి విసిరి కొట్టింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో మంత్రిగారి దురుసు ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక ప్రజాప్రతినిధిగా, అది కూడా మహిళా మంత్రిగా సవిత గారు ఇలా వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. బొకేను తిరస్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దానిని గౌరవంగా పక్కన పెట్టవచ్చు లేదా తన సిబ్బందికి ఇవ్వవచ్చు. కానీ, ఆమె దానిని విసిరివేయడం చూస్తుంటే, ఆమె అధికార గర్వానికి ఇది నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.. ఇలా అధికార గర్వంతో తన కింద అధికారులతో ఆమె వ్యవహరించిన తీరు సరైనది కాదని ఐదు సంవత్సరాల తర్వాత ఆమెకు ఆ మంత్రి పదవి ఉండకపోవచ్చు కానీ ఆ తహసిల్దార్ పదవి మాత్రం అలాగే ఉంటుంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు గౌరవం ఇవ్వడం మానేసి ఓ ప్రజా ప్రతినిధిగా ఈమె వ్యవహరించిన తీరు సరైంది కాదంటూ తప్పుపడుతున్నారు