Nara Lokesh: పాదయాత్రలో రెడ్ బుక్ గురించి చెబితే హేళన చేశారు… లోకేష్ కామెంట్స్ వైరల్!

Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక బృందం దావోస్ పర్యటనకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ బృందంలో నారా లోకేష్ తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్ళన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అక్కడ తెలుగువారితో కలిసి ఒక సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు మొదలయ్యాయని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇలా ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందంటూ వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై దావోస్ పర్యటనలో లోకేష్ స్పందించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో రెండు బుక్ రాస్తున్నాను అంటే చాలామంది హేళన చేశారు కానీ ఇప్పుడేమైంది అంటూ ఈయన ప్రశ్నించారు. తాను కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు గతంలో తన కార్యకర్తలను తమ పార్టీ నేతలను వేధించిన వారి పేర్లను మాత్రమే నమోదు చేశానని ఇప్పటికే రెడ్ బుక్ ఏపీలో అమలవుతుందని , అందరికీ ఇవ్వాల్సిన బాకీలను వడ్డీతో సహా ఇచ్చేస్తాను అన్న ధోరణిలో లోకేష్ మాట్లాడారు.

ఈయన యువగలం పాదయాత్రలో భాగంగా తమ పార్టీ నేతలను కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్న వైకాపా నేతలను ఆ పుస్తకంలో రాసుకొని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అంటూ గతంలో వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలపై అప్పటి మంత్రులు హేళన చేస్తూ మాట్లాడారు. ఇటీవల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో మాట్లాడిన కొందరు మంత్రులు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.