Prabhas Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాల్తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో తరహా సినిమా కాగా ఆ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన బిగ్గెస్ట్ మైథలాజికల్ డ్రామా “ఆదిపురుష్” కూడా ఒకటి ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా కూడా తెరకెక్కని విధంగా గ్రాండ్ విజువల్స్ తో ఈ సినిమా చేసినట్టుగా చిత్ర యూనిట్ తెలిపారు.
అయితే ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాకి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం ఆసక్తిగా మారింది.
తెలంగాణా కి చెందిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ “ఆదిపురుష్” సినిమాపై కొన్ని సంచలన కామెంట్స్ చెయ్యడం దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాని బీజేపీ వారి డైరెక్షన్ లోనే తెరకెక్కించారని సరిగ్గా ఇలాంటి సినిమాలతోనే పార్టీ ఎన్నికల ముందు వస్తుంది అని ఇవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతాయని..
అందులో భాగంగానే అప్పట్లో “యూరి” రీసెంట్ గా “కాశ్మీర్ ఫైల్స్” ఇప్పుడు నెక్స్ట్ “ఆదిపురుష్” సినిమా కూడా తెరకెక్కించబడింది అని ఆ సినిమాని రామ మందిరం ప్రారంభంకి కి ముందు రిలీజ్ చేస్తారని పలు సంచలన కామెంట్స్ చెయ్యగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ మాటల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.