Allu Arjun: ఇకపై మా బన్నీని ఎవరు అలా పిలవద్దు.. కొత్త కండిషన్ పెట్టబోతున్న అల్లు ఫ్యామిలీ?

Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ సీక్వెల్ సినిమా ద్వారా కూడా అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకొని ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇలా ఈయన జైలు పాలు కావడంతో అల్లు అర్జున్ గురించి ఎక్కడ ఎవరు ప్రస్తావించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అంటూ ఆయన పేరును ప్రస్తావిస్తున్నారు.

ఇలా ప్రతిసారి సంధ్య థియేటర్ తొక్కిసలాట అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అంటూ మాట్లాడటంతో ఆయన పేరు ప్రతిష్టలకు ఇది పూర్తిగా మైనస్ కానుందని చెప్పాలి. దాదాపు 22 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో కష్టపడి అల్లు అర్జున్ ఈ స్థాయికి చేరుకున్నారు. అలాంటిది ఒక చిన్న పొరపాటు కారణంగా ఆయన కెరియర్ మొత్తం డామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఇకపై అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే తనని కేవలం అల్లు అర్జున్ అని పిలిస్తే చాలు తన పేరు పక్కన ఐకాన్ స్టార్ స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అని పిలవకపోయినా పర్వాలేదు కేవలం అల్లు అర్జున్ అని పిలవండి అదే విధంగా ఇకపై ఎవరూ కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అని మాత్రం పిలవకూడదు అంటూ ఒక నోట్ విడుదల చేయడానికి అల్లు ఫ్యామిలీ సిద్ధమైందని తెలుస్తుంది.

ఈ ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఏ మాత్రం లేకపోయినా, ఈఘటనలో అల్లు అర్జున్ A11 ముద్దాయిగా ఉన్నప్పటికీ తనని అరెస్టు చేసి జైలుకు పంపించటాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఇక ప్రతిసారి అరెస్టు అయిన అల్లు అర్జున్ అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలను కూడా అభిమానులు తీసుకోలేకపోయారు. ఇలాంటి తరుణంలోని ఇకపై తనని అలా పిలవకూడదు అంటూ అల్లు ఫ్యామిలీ సరికొత్త కండిషన్ పెట్టబోతున్నారనే విషయం అభిమానులకు కాస్త ఊపిరినిచ్చింది.