ఆ విషయంలో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నంటున్న మంత్రి గుడివాడ..!

ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం గుడివాడ దావోస్ పర్యటన లో ఉండగా అక్కడ మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దావోస్ పర్యటన పై చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అని మండిపడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఏమైపోయినా పర్వాలేదన్నది చంద్రబాబు ఉద్దేశమని అన్నాడు. వైయస్ జగన్ కు పేరు, వ్యాఖ్యాతలు వస్తుంటే చంద్రబాబు అసలు తట్టుకోలేకపోతున్నాడని అన్నాడు. ఇక మంచి ఫలితాలతో దావోస్ నుంచి తిరిగి వస్తామని తెలిపాడు.