ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ ప్రమాదానాకి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా అంబర్ పేట ఓ ఆర్ ఆర్ లోకి ప్రవేశించగానే ఎస్కార్ట్ వాహనం టైర్ పేలు పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పాపారావు అనే హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్ నగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే గాయాలైన వారి ఆరోగ్య పరిస్థతి కూడా విషమంగా ఉందని సమాచారం. మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
క్షతగాత్రులను మంత్రి కారులోనే ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. పాపారావు మృతిపై మంత్రి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. అయితే ప్రమాదానికి కారణం బోలెరో టైర్ బ్లాస్ అవ్వడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టైర్ బ్లాస్ట్ అవ్వడంతో బోలెరో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో కారు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసారు.