Liger : ఇండస్ట్రీ టాక్ : “లైగర్” నాన్ థియేట్రికల్ బిజినెస్ కి మైండ్ బ్లోయింగ్ ఫిగర్స్ అట.!

Liger : టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో మాస్ అండ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “లైగర్” కూడా ఒకటి. వీరి కెరీర్ లలోనే ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాపై లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ సమాచారంలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాకి రీసెంట్ గానే భారీ ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల బిజినెస్ పై లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. మరి ఈ ఒక్క హక్కులకు ఏకంగా 100 కోట్లకి పైగా ధర పలికేసింది అట.
వీటిలో ఆడియో హక్కులని ప్రముఖ ఆడియో సంస్థ 14 కోట్లకి కొనుగోలు చెయ్యగా సాటిలైట్ మరియు ఓటిటి హక్కులు కలిపి 85 కోట్లకి పైగానే డీల్ క్లోజ్ అయ్యిందట. ఇది మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అని చెప్పాలి. అలాగే విజయ్ మరియు పూరి జగన్నాథ్ ల కెరీర్ లలోనే ఇవి అత్యధికం అని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
అలాగే ఈ హక్కులు అన్నీ కూడా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసిన పాన్ ఇండియా భాషల్లో కలిపి కొనుగోలు చేయబడినవి అట. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది అలాగే బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు.