పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టిన రోజును ప్రతి ఒక్కరు సంతోషంగా సరదాగా జరుపుకోవాలని అనుకుంటూ ఉంటారు . అంతేకాదు ఆ రోజు తన ఫ్రెండ్స్ కు పార్టీలు ఇవ్వడం లేదంటే షికారుకి వెళ్లడం చేస్తుంటారు. కాని ప్రముఖ మోడల్-యాక్టర్ మిలింద్ ఉషా సోమన్ తనకి ఇష్టమైన పని అంటూ అందరు నోరెళ్ళపెట్టే పనిచేశాడు. ఆయన చేసిన పనికి నవ్వాలా ఏడవాలా కూడా అర్దం కావడం లేదని అంటున్నారు నెటిజన్స్
వివారలలోకి వెళితే మిలింద్ ఉషా సోమన్ ఈ రోజు 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగిత్తారు. ఈ సన్నివేశాలని మిలింద్ భార్య అంకితా కొన్వార్ ఫోటోలు తీసారు. ఈ ఫోటోలని మిలింద్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..హ్యాపీ బర్త్ డే టు మీ.. 55 అండ్ రన్నింగ్ అంటూ తనకు తానే విష్ చేసుకున్నారు. ప్రస్తుతం మిలింద్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నాయి. అంతేకాదు ఆయనపై అనేక మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఓ మీమ్ లో లాలుప్రసాద్ యాదవ్ మిలింద్‌కు లోదుస్తులు ఇస్తున్నట్లు ఉండగ ఇది నెలిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇవే ఫోటోలను సోమన్ భార్య అంకిత కోన్వర్ కూడా షేర్ చేస్తూ తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే మిలింద్ సోమన్ న్యూడ్ గా సోషల్ మీడియాలో కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. 90 లలో టఫ్ షూస్ అనే ప్రకనట కోసం మాజీ మిస్ ఇండియా మధు సప్రేతో కలిసి న్యూడ్‌గా ఫొటో షూట్ లో పాల్గొని రచ్ చేశారు. దీనిపై వీరిద్దరితో పాటు ఫోటోగ్రాఫర్, పబ్లీషర్‌పై 14 ఏళ్ళ కేసు నమోదైంది.